Wednesday, 7 October 2015

tholipremakavithalu

మనసు ఎందుకో నిలకడగా లేదు 
ఆలోచన మారాను లేదు 
ఎదో సందేహం 
ప్రపంచం అందంగానే ఉంది 
నేను నాతో లేను 
దాని అర్థం ఏమిటో తెలియడం లేదు
చూపులు అల అల పక్కకు మల్లుతున్నయ్
నా నడకలు తుల్లుతున్నయ్
బహుశ ఆరోగ్యం బాగులేదా?
కానే కాదు...
మద్య మద్యలో ఓ స్వప్నం...
రూపు సరిగ్గా అగుపించటం లేదు
మాట సరిగ్గా వినిపించటం లేదు
నా మనసు ఆ స్వప్నాన్ని
అందుకునే ప్రయత్నం చేస్తున్నది
చల్లని గాలి నా వైపే విస్తున్నది
ఘల్లుమని ఒక శబ్దం
నా గుండెని ఝాల్లుమనిపించింది
అది ఒక జాబిల్లి మువ్వల సవ్వడి
బహుశ అది నా ప్రియసఖిదేమో
అవును... నేను నా మదిలో దాచుకున్న ఊహల రూపానిదే
నన్ను చేరగా చెలి నా వైపు
అడుగులు వేస్తున్నట్లున్నది
ఆనందం ఆకాశంలా సాగిపోతున్నది...!
-కే పి లక్ష్మి నరసింహ

rythu gosha

సూరీడి మంట 
కన్నీళ్ళ పంట 
ఒక్క డల్లు సినుకు కురువదు...
మల్లన్న మడికట్లల్ల 
గుసోని ఆకాసం దిక్కు జూస్తుండు 
గుండె నిండా మొగులు దిగులుండె
అవనికి అన్నం బెట్టాలని
అలుపు సొలుపు లేకుండ
బతుకు పోరు జేస్తుంటే
కరువు రైతన్న పాలిట
పున్నమి సెoద్రుడైంది
అన్నదాత ఆకలి
నీలి నింగైంది
ఇంటికాడ సంటిపిల్ల,పిల్లగాండ్లు
ముద్దులొలికే కన్నబిడ్డల
కడుపులు డొక్కకు డొక్కతికే
పొలం నుంచి పోంగనే
మా నాయినేం దెచ్చెనో
నాకెంతిస్తడోనని ఎదురు జూస్తుండ్రో...
ఏమెరుగని పసికూనలకు
ఏమీ లేకపాయె
ఆమెనేమో పచ్చి బాలింత
సరిపాయె సంటిపాప లాలింత
గడప దాటనీకె రాదు...
పసి మొగ్గల ఆకలి ఆర్తనాదాలు
ఆకాసాన్ని మీటుతున్నయ్
ఆల్ల ఎదురు సూపులకు
ఎదురు వోయి ఏం జెప్పుదునని
పొలం నిడ్సి పోతలేడు
దుక్కిలోనే దిగులు వడుతున్నడు
పిల్లలని ఎట్లసాకుదునని
సప్పుడిన్పించకుండా
ఎవసం జేసిన పొలంల గుసోని
ఎక్కి ఎక్కి ఏడుస్తుండు
భగ భగ మండే సూరీడ్ని జూస్తూ
మడికట్లల్లనే కుప్పకూలిండు
మెతుకు లేక బతుకునిడ్సిండు..!
-కే పి లక్ష్మి నరసింహ

premakavithalu

పండిన జాబిల్లివలె 
నీ దరహాసం 
నా హృదయ లోతుల్లో 
సాగర తీరాన అలల 
ఎగసి పడుతున్న ఈ వేళా 
నా మది వెతుకుతున్నది నీ బాట...
నింగిలో నీలి రంగువలె
నీ రూపం
నా నయనంలో నెమలి వలె
నాట్యం చేస్తున్న ఈ వేళా
నీ సుందర సప్నాలె
నా ముందు వాలుతున్నవి
నీ ఊహలు కనిపించని చెరసాలై బందిస్తున్నవి...!

రచన: కే పి లక్ష్మి నరసింహ MA 
సెల్:9010645470

telangana song lyrics

రైలెక్కి నువ్వూ రారో సెల్లెమ్మ
రాగాలు తిద్దము మనమే సెల్లెమ్మ 
ఎర్రాని బస్సెక్కి రారో సెల్లెమ్మ 
ఎదురు జూస్తున్న నీకై సెల్లెమ్మ 
పల్లే పిలిసింది రారో సెల్లెమ్మ 
కన్నతల్లీ పిలిసింది రారో సెల్లెమ్మ
రైలెక్కి నువ్వూ రారో సెల్లెమ్మ
రాగాలు తిద్దము మనమే సెల్లెమ్మ
బతుకమ్మ పండుగోచ్చే సెల్లెమ్మ
బంగారుతల్లి మనదే సెల్లెమ్మ
పట్టూ వస్త్రాలు నీకై సెల్లెమ్మ
పాలమూర్ల తెచ్చినాను సెల్లెమ్మ
రైలెక్కి నువ్వూ రారో సెల్లెమ్మ
రాగాలు తిద్దము మనమే సెల్లెమ్మ
బంగారు బతుకమ్మ జెయ్యా సెల్లెమ్మ
బయలెల్లి నువ్వు రారో సెల్లెమ్మ
పచ్చ పచ్చని పల్లె మనదే సెల్లమ్మ
తెలంగాణ తల్లి మనదే సెల్లెమ్మ
రైలెక్కి నువ్వూ రారో సెల్లెమ్మ
రాగాలు తిద్దము మనమే సెల్లెమ్మ
బంతిపూలు తెచ్చినాను సెల్లెమ్మ
బతుకమ్మ జెయ్యా రారో సెల్లెమ్మ
తంగేడి పూలు తెచ్చినాను సెల్లెమ్మ
తలనీల్లు వోసుక రారో సెల్లెమ్మ
గునుగు పూలు తెచ్చినాను సెల్లెమ్మ
బతుకమ్మ పేర్సగ రారో సెల్లెమ్మ
రైలెక్కి నువ్వూ రారో సెల్లెమ్మ
రాగాలు తిద్దము మనమే సెల్లెమ్మ
బావ గారినడిగి రారో సెల్లెమ్మ
బతుకమ్మ పండుగనీ సెల్లెమ్మ
అత్తమావలనడిగి రారో సెల్లెమ్మ
అన్ని సక్కగ జూసి రారో సెల్లెమ్మ
రైలెక్కి నువ్వూ రారో సెల్లెమ్మ
రాగాలు తిద్దము మనమే సెల్లెమ్మ
మన జాతి పండుగరో సెల్లెమ్మ
మన ఖ్యాతి పెంచాలిరో సెల్లెమ్మ 

రచన: కే పి లక్ష్మి నరసింహ MA 
సెల్:9010645470